యాదాద్రిలో ఘనంగా ధ్వజారోహణం

యాదాద్రిలో ఘనంగా ధ్వజారోహణం

వెలుగు : యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం ధ్వజారోహణాన్ని వైభవంగా నిర్వహించారు. అర్చకుల వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ గరుత్మంతుడిని ఆహ్వానించడానికి గరుడ ముద్దలను ఎగురవేశారు. బ్రహ్మోత్సవాలకు అష్ట దిక్పాలకులను ఆహ్వానించడానికి రాత్రి భేరీ పూజ, దేవతాహ్వానం కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, ఈవో గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆదివారం నుంచి అలంకార సేవలు మొదలుకానున్నాయి. మొదటి రోజు స్వామివారు మత్స్యావతారంలో, సాయంత్రం శేషవాహన సేవలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.