
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవలే వరుసగా రెండు హాఫ్ సెంచరీలు మినహాయిస్తే హిట్ మ్యాన్ నుంచి పూర్తిగా నిరాశపరిచాడు. ఇకపై ముంబై ప్లే ఆఫ్స్ కోసం కీలక మ్యాచ్ లు ఆడనుండగా ఈ ముంబై మాజీ సారధి ఫామ్ లోకి రావడం చాలా ముఖ్యం. ప్రస్తుత సీజన్ లో విమర్శలు ఎదుర్కొంటున్న రోహిత్.. తన ఫామ్ పై స్పందించాడు. తాను వ్యక్తిగతంగా ఎలాంటి లక్ష్యాలు పెట్టుకోలేదని.. జట్టు గెలుపు కోసం ఆలోచించే ఆటగాడినని తన పుట్టిన రోజు తెలిపాడు.
బుధవారం (ఏప్రిల్ 30) తన పుట్టిన రోజున జర్నలిస్ట్ విమల్ కుమార్‌తో మాట్లాడుతూ.. ఏ ఐపీఎల్ ఎడిషన్ లోనూ తాను పరుగుల పరంగా ఎప్పుడూ లక్ష్యాన్ని నిర్దేశించలేదని.. జట్టు మ్యాచ్‌లను గెలిపించడంపై దృష్టి పెడతానని రోహిత్ వివరించాడు. ముంబై ఇండియన్స్ ట్రోఫీ గెలిచిన ఐదు సందర్భాల్లో తమ జట్టు నుండి ఏ ఆటగాడు ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకోలేదని అన్నాడు. " నేను 600, 700, 800 పరుగులు సాధిచినప్పుడు జట్టు గెలవకపోతే దాని వల్ల ప్రయోజనం లేదు. జట్టు ఫైనల్‌కి వెళ్లి గెలవకపోతే నేను 500 పరుగులు చేసినా ఫలితం ఉండదు. నాకు వ్యక్తిగతంగా నాకు మంచి పేరు తీసుకొచ్చినా జట్టుకు నా ఇన్నింగ్స్ ఉపయోగపడినప్పుడే నా ఇన్నింగ్స్ కు ఒక అర్ధం.
Also Read : టీ20 వరల్డ్ కప్‌కు వేదికలు ఖరారు చేసిన ఐసీసీ.. ఫైనల్ ఎక్కడంటే..?
ఒక సీజన్‌లో ఇన్ని పరుగులు సాధించాలనే లక్ష్యాన్ని నేను ఎప్పుడూ నిర్దేశించుకోలేదు. నేను జట్టు కోసం మ్యాచ్‌లు గెలవాలనుకుంటున్నాను. జట్టు విజయం కోసం నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. 20-30 పరుగులు జట్టుకు ఉపయోగపడుతుందని నేను చెప్పడం లేదు. నేను జట్టు కోసం ఏం చేయగలను. అది జట్టుకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుందనే దానిపై నేను దృష్టి పెడతాను. ముంబై ఇండియన్స్ టోర్నమెంట్ గెలిచినప్పుడల్లా, మా జట్టు నుండి ఎవరూ ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకోలేదు. జట్టులో అందరూ సమిష్టిగా రాణించడం వలనే ఇది సాధ్యం". అని హిట్ మ్యాన్ అన్నాడు.
— gocvideo (@gocvideo) May 1, 2025
ఐపీఎల్ చరిత్రలో ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన ముంబై ఇండియన్స్. ప్రస్తుత సీజన్ లోనూ అద్భుతంగా ఆడుతుంది. తొలి 5 మ్యాచ్ ల్లో నాలుగు మ్యాచ్ లు ఓడిపోయినా ఆ తర్వాత వరుసగా 5 విజయాలతో సత్తా చాటింది. ఇప్పటివరకు 10 మ్యాచ్ ల్లో 6 విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ రేస్ లో ఉంది. ముంబై నేడు (మే 1) జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ లోనూ గెలిచి ఈ టోర్నీలో డబుల్ హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది.