
ఐపీఎల్ 2025 లో రాజస్థాన్ రాయల్స్ సొంతగడ్డపై మరో డూ ఆర్ డై మ్యాచ్ లో ఆడబోతుంది. గురువారం (మే 1) జైపూర్ లోని మాన్సింగ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ముంబై ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ ను తక్కువగా అంచనా వేస్తే పొరపాటే అవుతుంది. గుజరాత్ టైటాన్స్ పై విజయం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
Also Read : 800 పరుగులు చేసినా జట్టు గెలవకపోతే ఏం ప్రయోజనం..
ఈ సీజన్ లో ముంబై ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ ల్లో 6 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. మరోవైపు రాజస్థాన్ ఆడిన 10 మ్యాచ్ ల్లో 3 విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ కోసం పోరాడుతుంది. నేడు జరగనున్న మ్యాచ్ లో రాజస్థాన్ ఓడిపోతే టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమిస్తుంది. మరోవైపు ముంబై గెలిస్తే 7 విజయాలతో ప్లే ఆఫ్స్ కు దగ్గరవవుతుంది. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే రాజస్థాన్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. హసరంగా, సందీప్ శర్మ ఈ మ్యాచ్ లో ఆడడం లేదు. వీరి స్థానాల్లో కుమార్ కార్తికేయ, ఆకాష్ మద్వాల్ తుది జట్టులోకి వచ్చారు. ముంబై ఎలాంటి మార్పులు చేయలేదు.