లాంగ్ జంప్ దూరాన్ని తగ్గించాలి

లాంగ్ జంప్ దూరాన్ని తగ్గించాలి

లాంగ్ జంప్ దూరాన్ని తగ్గించాలి
డీవైఎఫ్ఐ స్టేట్ ప్రెసిడెంట్ కోట రమేశ్

ఖైరతాబాద్, వెలుగు : ఎస్సై, కానిస్టేబుల్ నియామకాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఫిజికల్ టెస్టుల్లో లాంగ్ జంప్ దూరాన్ని తగ్గించి, ఎత్తును మాన్యువల్‌గా కొలవాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేశ్, ఆనగంటి వెంకటేశ్ డిమాండ్ చేశారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏఓ సంపత్‌ను డీజీపీ ఆఫీసులో కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఫిజికల్​ టెస్టుల్లో లాంగ్ జంప్ ను 3.8 మీటర్లు నుంచి 4 మీటర్లకు, షాట్‌పుట్​ను 5.6 నుంచి 6 మీటర్లకు పెంచారని, దీంతో ఎక్కువ మంది అభ్యర్థులు నష్టపోతున్నారని తెలిపారు.

డిజిటల్ పద్ధతిలో ఎత్తు కొలుస్తుండటంతో సాంకేతిక లోపాల కారణంగా చాలామంది క్వాలిఫై కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం  స్పందించి మాన్యువల్‌గా ఎత్తు కొలవాలని, లాంగ్ జంప్ దూరాన్ని తగ్గించి పాత విధానాన్ని అమలు చేయాలని డిమాండ్​ చేశారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ జావెద్, అభ్యర్థులు జ్యోతి, విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.