కరీంనగర్ రైల్వే స్టేషన్ మస్తుందిగా.. ఫొటోలు మీరూ చూసేయండి..

కరీంనగర్ రైల్వే స్టేషన్ మస్తుందిగా.. ఫొటోలు మీరూ చూసేయండి..

కరీంనగర్: తెలంగాణలో మూడు రైల్వే స్టేషన్లు నూతన శోభను సంతరించుకున్నాయి. హైదరాబాద్ నగరంలోని బేగంపేటతో పాటు వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. మే 22న ప్రధాన మోదీ వర్చువల్ పద్ధతిలో ఈ రైల్వే స్టేషన్లను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా.. దక్షిణ మధ్య రైల్వే ఈ రైల్వే స్టేషన్ల తాజా ఫొటోలను ‘ఎక్స్’ వేదికగా పంచుకుంది.

ALSO READ | కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చెయ్యాలి: బండి సంజయ్

అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్(ఏబీఎస్ఎస్) నిధులతో చేపట్టిన పనులతో ఈ స్టేషన్ల రూపు రేఖలే మారిపోయాయి. ఆకట్టుకునే ఎలివేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఎయిర్ పోర్ట్ తరహా గ్రాండ్ లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సంతరించుకున్నాయి. రైల్వే స్టేషన్ బయట, లోపల ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు. రెండేళ్ల కింద కరీంనగర్ రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.26.64కోట్లతో చేపట్టిన పనులు ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యాయి.

కరీంనగర్ రైల్వే స్టేషన్ను పూర్తిగా అప్ గ్రేడ్ చేశారు. ఒక ఫ్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి మరోదానికి వెళ్లేందుకు ప్రయాణికులకు మెట్లు ఎక్కే బాధ తప్పించేందుకు ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేశారు. విశాలమైన వెయిటింగ్ హాల్స్, పరిశుభ్రమైన ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, మోడ్రన్ టాయిలెట్లు,  లైటింగ్, టికెట్ కౌంటర్లు, లాకర్ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, డ్రింకింగ్ వాటర్, ఏటీఎంలు, డిజిటల్ డిస్ ప్లేలు, సీసీ కెమెరాలు అందుబాటులోకి తీసుకొచ్చారు.

అంతేగాక రైల్వే స్టేషన్ లోపల సౌలతులతోపాటు బయట కూడా పచ్చదనం, పరిశుభ్రతతో ఆహ్లాదపరిచేలా లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, మొక్కలతో అభివృద్ధి చేశారు. వాహనదారులకు నీడతో కూడిన విశాలమైన పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. కరీంనగర్ రైల్వే స్టేషన్కు వెళ్లే రోడ్డును డివైడర్తో కూడిన డబుల్ రోడ్డుగా డెవలప్ చేశారు.