దేశంలో కరోనా కేసులు పెరగడానికి ఢిల్లీలో జరిగిన తబ్లీగీ జమాతే కారణమని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. శనివారం ఈ-ఎజెండా ఆజ్‌టక్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తబ్లీగీ జమాత్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి “క్యారియర్లు” గా పనిచేశారన్నారు. తబ్లిగీ జమాత్ చేసిన పనిని ఖండిస్తున్నానని, తబ్లిగీ సభ్యులు ఈ విధంగా ప్రవర్తించకుండా ఉండి ఉంటే లాక్‌డౌన్ మొదటి దశలోనే కరోనాను అదుపు చేసేవాళ్లమని చెప్పారు.
తబ్లిఘి జమాత్ నేరపూరితమైన చర్యకు పాల్పడిందని, తదనుగుణంగా వారిని శిక్షించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఢిల్లీలో జరిగిన ఆ సమావేశానికి ఉత్తరప్రదేశ్ నుంచి సుమారు 3 వేల మంది అన్నారు. ఒక వ్యాధి రావడం నేరం కాదు.. కానీ, దానిని వ్యాపించేందుకు కారణం అవడం మాత్రం నేరమేనని యోగి అన్నారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కాగా..యూపీలోఇప్పటి వరకు 2,338 పాజిటివ్ కేసులు నమోదవగా.. వారిలో 654 మంది కోలుకున్నారు. 42 మంది మరణించారు. 1,000 కి పైగా కోవిడ్ -19 కేసులు నమోదైన కొన్ని రాష్ట్రాలలో ఉత్తర ప్రదేశ్ కూడా ఉంది.

