భారత్ లో అమెజాన్ హోల్ సేల్ డిస్ట్రిబ్యూషన్ బంద్

భారత్ లో అమెజాన్ హోల్ సేల్ డిస్ట్రిబ్యూషన్ బంద్

ఇ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ భారత్ లో హోల్ సేల్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాన్ని మూసేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే ఉద్యోగాల కోతతో పాటు నవంబర్ 24న ఎడ్యుటెక్, నవంబర్ 25న ఫుడ్ డెలివరీ వ్యాపారాన్ని మూసేస్తున్నట్టు ప్రకటించారు అమెజాన్ సంస్థ సీఈఓ ఆండీ జాస్సీ. అమెజాన్‌కు భారత్ కీలకమైన విదేశీ మార్కెట్ అయినప్పటికీ హోల్ సేల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి తప్పుకుంటుంది. దీనికి కారణం కంపెనీ వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్‌లకు పోటీ ఇవ్వలేకపోవడమే అంటున్నారు.
అమెజాన్ హోల్ సేల్ డిస్ట్రిబ్యూషన్ దుకాణాలు భారతదేశంలో ప్రధానంగా బెంగళూర్, మైసూర్, హుబ్లీల్లో ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. ఈ దుకాణాలు  ఫార్మసీలు, డిపార్ట్‌మెంట్ స్టోర్స్ కు గూడ్స్ సప్లై చేస్తాయి. అమెజాన్ హోల్ సేల్ డిస్ట్రిబ్యూషన్ మూసివేయడం వల్ల ఆర్థిక భారం తగ్గుతుందని అంటున్నారు.