మేడారంలో ‘ఈ- కానుక’.. గద్దెల వద్ద క్యూఆర్‌‌ కోడ్‌‌ ఏర్పాటు

మేడారంలో ‘ఈ- కానుక’.. గద్దెల వద్ద క్యూఆర్‌‌ కోడ్‌‌ ఏర్పాటు

తాడ్వాయి, వెలుగు : మేడారం వచ్చే భక్తులు అమ్మవార్లకు ఆన్‌‌లైన్‌‌లో కానుకలు చెల్లించేందుకు వీలుగా ఆఫీసర్లు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా అమ్మవార్ల గద్దెల వద్ద ‘ఈ – కానుక’ పేరుతో క్యూఆర్‌‌ కోడ్‌‌ను ఆవిష్కరించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన ఈ  క్యూఆర్‌‌ కోడ్‌‌ను సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య, ఆఫీసర్లు ఆవిష్కరించారు. 

అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు తమ కానుకలను క్యాష్‌‌లెస్‌‌ రూపంలో ఇచ్చేందుకు వీలుగా తాడ్వాయి కెనరా బ్యాంక్‌‌ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఆఫీసర్లు తెలిపారు. కార్యక్రమంలో మేడారం ఈవో వీరస్వామి, కెనరా బ్యాంక్‌‌ మేనేజర్‌‌ సునీల్‌‌కుమార్‌‌, సిబ్బంది జగదీశ్‌‌ పాల్గొన్నారు.