బంగారానికి ఈ-వే బిల్లు

బంగారానికి ఈ-వే బిల్లు

మంత్రుల ప్యానెల్ సిఫార్సు

రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయం

న్యూఢిల్లీ : బంగారంపై పన్ను ఎగవేతలను తగ్గించేందుకు జీఎస్టీ మండలి ఏర్పాటు చేసిన ప్యానెల్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రాల మధ్య తరలించే గోల్డ్‌‌కు ఈ–వే బిల్లులు తప్పనిసరి చేయాలని భావిస్తోంది. ఈ విషయంలో రాష్ట్రాలు సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చని మంత్రుల ప్యానెల్‌ తెలియజేసింది. ఈ–వే బిల్లు మెకానిజం అమలు చేయాలనుకుంటే, రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించుకోవచ్చని కేరళ ఆర్థిక మంత్రి, ప్యానల్ హెడ్ థామస్ ఐజాక్, బిహార్ డిప్యూ టీ ముఖ్యమంత్రి సుశీల్ మోడీ అన్నారు ప్రస్తుతం రూ.50 వేలకు పైబడిన గూడ్స్ రాష్ట్రాల మధ్య తరలించాలంటే, ఈ–వే బిల్లు తప్పనిసరి. ఈ నిబంధన నుంచి గోల్డ్‌‌ను మినహాయించారు. పన్ను ఎగవేతలను, గోల్డ్ స్మగ్లింగ్‌ ను తగ్గించేందుకు బంగారం రవాణాకూ ఈ–వే బిల్‌ ఉండాలని ప్యానెల్‌ ప్రతిపాదించింది. గోల్డ్‌‌కు , ఇతర విలువైన రాళ్లకు ఈ–వే బిల్లు మెకానిజాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను పరిశీలిం చడానికి జీఎస్టీ కౌన్సిల్ ఈ ప్యానెల్‌ ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం గోల్డ్‌‌పై మూడు శాతం జీఎస్టీని ప్రభుత్వం వసూలు చేస్తోంది. వజ్రాలపై 0.25 శాతం నుంచి 3 శాతం వరకు పన్నులున్నాయి.

విధానాల్లో మార్పులు తప్పనిసరి..

బంగారం రవాణా కోసం ఈ–వే బిల్లు తయారు చేయని న్యాయపరమైన మార్పులు అవసరం అవుతాయి. మంత్రుల ప్యానెల్‌ చేసిన ఈ ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించాల్సి ఉంటుంది. గోల్డ్‌‌కు తగిన ట్యాక్స్ అడ్మి నిస్ట్రేషన్ అవసరమని ఐజాక్ అన్నారు . ఈ–వే బిల్లు సిస్టమ్‌ ను అమలు చేయడం ద్వారా గోల్డ్, డైమండ్ ఇండస్ట్రీకి పేరుగాంచిన గుజరాత్ లాంటి రాష్ట్రాల నుంచి రవాణా అయ్యే గోల్డ్ డేటా ట్రాక్‌ చేయొచ్చు. అయితే రాష్ట్రాల మధ్య రవాణా అయ్యే గోల్డ్‌‌కు ఈ–వే బిల్లు మెకానిజం తప్పనిసరి చేయడం కష్టమైన పనేనని మోడీ అన్నారు . అంతేగాక సెక్యూరి టీపరమైన ఆందోళనలు కూడా తలెత్తుతాయన్నారు . మంత్రుల బృందంలో ఐజాక్‌ , మోడీతో పాటు గుజరాత్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నితిన్ పటేల్, కర్నాటక హోమ్ మంత్రి బసవరాజ్ బొమ్మై, పంజాబ్, పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రులు మన్‌ ప్రీత్ సింగ్ బాదల్, అమిత్ మిత్రాలు ఉన్నారు. మంత్రులు తమ ఫైనల్ ప్రపోజల్స్‌‌ను ఇంకా జీఎస్టీ కౌన్సిల్‌కు అందజేయలేదు.