సోనీ బాటలో మరో గేమింగ్ సంస్థ - 670 మంది ఉద్యోగాలకు కోత..!

సోనీ బాటలో మరో గేమింగ్ సంస్థ - 670 మంది ఉద్యోగాలకు కోత..!

ఇటీవల ప్రముఖ కార్పొరేట్ సంస్థ సోనీ లండన్లోని తన స్టూడియోను మూసివేస్తూ 900మంది ఉద్యోగాలకు ఉద్వాసన పలకటం సంచలనం అయ్యింది. సోనీ సంస్థ బాటలోనే మరొక ప్రముఖ గేమింగ్ కంపెనీ ఎలక్ట్రానిక్ ఆర్ట్స్  ( EA ) 670 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది. సంస్థలోని 5శాతం మంది ఉద్యోగులను తీసివేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. గత సంవత్సరం కూడా ఈ సంస్థ 6శాతం మందిఉద్యోగులకు ఉద్వాసన పలికిందని సమాచారం.

ప్రస్తుత కాలానుగుణ పరిస్థితుల దృష్ట్యా సంస్థ డిజైన్ చేసిన కొన్ని గేమ్స్ ని నిలిపివేయాలని నిర్ణయించామని, అందుకే ఆ గేమ్స్ కి సంబందించి పని చేసేవారిని వదులుకోక తప్పట్లేదని సంస్థ తెలిపింది. ఇందులో భాగంగా తమ స్ట్రాటజీస్ లో కూడా మార్పులు తెస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ బ్రాంచీలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయా లేదా అని కూడా పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. 

ALSO READ :- NRI లకు ఆధార్ - అప్లికేషన్ ప్రాసెస్, ఇతర వివరాలు..!