NRI లకు ఆధార్ - అప్లికేషన్ ప్రాసెస్, ఇతర వివరాలు..!

NRI లకు ఆధార్ - అప్లికేషన్ ప్రాసెస్, ఇతర వివరాలు..!

ఎన్నారైలు కూడా ఆధార్ పొందే విధంగా సవరణలు చేసింది ప్రభుత్వం. ఇండియన్ పాస్ పోర్ట్ కలిగి ఉన్న ఎన్నారైలు రెసిడెంట్ ప్రూఫ్స్ అవసరం లేకుండానే ఆధార్ పొందే విదంగా అప్లికేషన్ ప్రాసెస్ లో సవరణలు చేసింది. ప్రభుత్వం చేసిన ఈ సవరణల వల్ల ఇకపై బ్యాంకు లావాదేవీలు, ప్రాపర్టీ రెంటల్స్ వంటి అంశాల్లో సమస్యలు తలెత్తవు. UIDAI ఎన్నారైలను దృష్టిలో ఉంచుకొని ఇటీవల చేసిన సవరణల వల్ల ఎన్నారైలు ఈజీగా ఆధార్ పొందవచ్చు.

ఫామ్ 1 ద్వారా 18ఏళ్ళు నిండిన వారెవరైనా ఇండియన్ అడ్రస్ ప్రూఫ్ ఉంటే ఆధార్ కి అప్లై చేసుకోచ్చు.

దేశం బయట అడ్రస్ ప్రూఫ్ ఉన్న ఎన్నారైలు  కూడా ఆధార్ కి అప్లై చేసుకునే విధంగా ఫామ్ 2ని డిజైన్ చేసింది ప్రభుత్వం.

5 నుండి 8సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు ఇండియన్ అడ్రస్ ప్రూఫ్ ఉంటే ఫామ్ 3 ద్వారా అప్లై చేసుకోవచ్చు.

ఇండియన్ అడ్రస్ ప్రూఫ్ లేని పిల్లలు ఫామ్ 4 ద్వారా ఆధార్ కి అప్లై చేసుకోవచ్చు.

ఇండియన్ అడ్రస్ ప్రూఫ్ ఉన్న 5సంవత్సరాల లోపు పిల్లలకు ఫామ్ 5 ద్వారా ఆధార్ అప్లై చేసుకోవచ్చు.

ఇండియన్ అడ్రస్ ప్రూఫ్ 5సంవత్సరాల లోపు పిల్లలకు ఫామ్ 6ద్వారా అప్లై చేసుకోవచ్చు.

రెసిడెంట్ ఫారిన్ నేషనల్స్ కోసం ఫామ్ 7, రెసిడెంట్ ఫారిన్ నేషనల్ మైనర్స్ కోసం ఫామ్ 8, ఆధార్ క్యాన్సలేషన్ కోసం ఫామ్ 9లో సవరణలు చేసింది ప్రభుత్వం. 

అక్టోబర్ 1, 2023 తర్వాత జన్మించిన వారంతా ఏదైనా ఆధార్ సెంటర్ కి వెళ్లి అప్లై చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.

ALSO READ :- 1904లో మునిగిపోయిన పడవ.. ఇప్పుడు బయటకు వచ్చింది