రెండున్నర లక్షలు దాటిన ఎప్ సెట్ అప్లికేషన్లు

రెండున్నర లక్షలు దాటిన ఎప్ సెట్ అప్లికేషన్లు

వచ్చే నెల 6 దాకా అప్లైకి చాన్స్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ ఎప్ సెట్(ఎంసెట్)కు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. మంగళవారం సాయంత్రం నాటికి 2,54,252 మంది అప్లై చేశారని ఎప్ సెట్ కన్వీనర్ దీన్ కుమార్, కో కన్వీనర్ విజయకుమార్ తెలిపారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్ కు 1,84,169, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్  కు 69,881 అప్లికేషన్స్ వచ్చాయని చెప్పారు. రెండింటికీ దరఖాస్తు చేసిన వారు 202 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఫిబ్రవరి 26 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా, ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 6 వరకూ  దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. అయితే, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇటీవలె ఎప్ సెట్ ఎగ్జామ్స్ మే 7 నుంచి 11 వరకూ నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.