ఇంజినీరింగ్​, అగ్రికల్చర్​, ఫార్మసీ ఎంట్రెన్స్​కు ఈఏపీసెట్‌‌‌‌

ఇంజినీరింగ్​, అగ్రికల్చర్​, ఫార్మసీ ఎంట్రెన్స్​కు ఈఏపీసెట్‌‌‌‌

తెలంగాణ స్టేట్‌‌‌‌ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్‌‌‌‌ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 (ఈఏపీ సెట్‌‌‌‌) నోటిఫికేషన్‌‌‌‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి రిలీజ్​ చేసింది. ఎగ్జామ్​ జవహర్‌‌‌‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్‌‌‌‌టీయూహెచ్‌‌‌‌) నిర్వహించనుంది. ఈ ప్రకటన ద్వారా 2024 – -25 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ అన్‌‌‌‌ఎయిడెడ్, అఫిలియేటెడ్‌‌‌‌ ప్రొఫెషనల్‌‌‌‌ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్‌‌‌‌, అగ్రిక‌‌‌‌ల్చర్‌‌‌‌, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్స్​ కల్పిస్తారు.

కోర్సులు: 1. బీఈ, బీటెక్‌‌‌‌/ బీటెక్ (బయో-టెక్నాలజీ)/ బీటెక్ (డెయిరీ టెక్నాలజీ)/ బీటెక్ (అగ్రికల్చర్‌‌‌‌ ఇంజినీరింగ్)/ బీఫార్మసీ/ బీటెక్‌‌‌‌(ఫుడ్ టెక్నాలజీ)/ బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్/ బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్/ బీఎస్సీ(ఫారెస్ట్రీ)/ బీవీఎస్సీ అండ్‌‌‌‌ ఏహెచ్‌‌‌‌/ బీఎఫ్‌‌‌‌ఎస్సీ. 2. ఫార్మ్-డి. 3. బీఎస్సీ(నర్సింగ్).
అర్హత: ఇంటర్మీడియట్‌‌‌‌(ఎంపీసీ/ బైపీసీ)లో ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరి. 

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్‌‌‌‌లైన్ ద్వారా ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్​ 6 వరకు దరఖాస్తు చేయాలి. ఏప్రిల్‌‌‌‌ 9 నుంచి - మే 4 వరకు రూ.250 నుంచి రూ.5 వేల వరకు ఆలస్య రుసుముతో దరఖాస్తుకు అవకాశం  ఉంది.  రూ.900(ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌‌‌‌ అభ్యర్థులకు రూ.500). రెండు స్ట్రీమ్‌‌‌‌లకు రూ.1,800(ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌‌‌‌ అభ్యర్థులకు రూ.1000) అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. మే 9, 10 తేదీల్లో ఇంజినీరింగ్‌‌‌‌; 11, 12 తేదీల్లో అగ్రికల్చర్‌‌‌‌ అండ్‌‌‌‌ ఫార్మసీ పరీక్షలు నిర్వహిస్తారు. పూర్తి సమాచారం కోసం www.eapcet.tsche.ac.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.