అవకాశం కోసమే రాజగోపాల్ పార్టీ మారిండన్న కేటీఆర్

అవకాశం కోసమే రాజగోపాల్ పార్టీ మారిండన్న కేటీఆర్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో సహకరించాలని కోరుతూ బీజేపీ లీడర్‌‌‌‌ జగన్నాథానికి టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌, మంత్రి కేటీఆర్‌‌‌‌ మంగళవారం  ఫోన్‌‌‌‌ చేశారు. ‘‘అన్నా.. మీ ఆశీర్వాదం కావాలి” అని కోరారు. వారిద్దరి మధ్య జరిగిన ఫోన్‌‌‌‌ సంభాషణ సోషల్‌‌‌‌ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ముచ్చట ఇలా సాగింది. కేటీఆర్‌‌‌‌: ఈ ఎన్నికతో బీజేపీ గవర్నమెంట్‌‌‌‌ వచ్చేది లేదు. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ గవర్నమెంట్‌‌‌‌ పోయేది లేదు. హండ్రెడ్‌‌‌‌ పర్సెంట్‌‌‌‌ మీకు తెలుసు అన్న రాజగోపాల్‌‌‌‌ రెడ్డి గారు, ఆయన వ్యవహారం మీకు తెలుసు. ఆయన ఎప్పుడన్నా తన నియోజకవర్గాన్ని పట్టించుకున్నడా? ప్రజలను పట్టించుకున్నడా?  ఇదంతా మీ అనుభవంల ఉన్నది. నేను జెప్పే అక్కరలేదు. రాజగోపాల్‌‌‌‌ ఏమన్న పాత ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ మనిషో, పాత బీజేపీ మనిషో అంటే అదీ కాదు. అవకాశం కోసం, తన అవసరాల కోసం పార్టీ మారినడు తప్ప మోడీ మీద ప్రేమతో కాదు. నా విజ్ఞప్తి ఏందంటే.. దయచేసి గట్టుప్పల్‌‌‌‌ల మీరు సహకారం ఇస్తే.. మీరు కొద్దిగ నాకు సహకరిస్తే బ్రహ్మాండంగా పనిచేసుకుందాం. నియోజకవర్గాన్ని నేను దత్తత తీసుకుంటనని చెప్పిన. అన్ని రకాలుగా అండగా ఉంటా. మీకు, నేతన్నలకు కూడా మేం పనిచేసి అడుగుతున్నం. 

జగన్నాథం: చేసిన్రు. కొన్ని పథకాలు వచ్చినయి.

కేటీఆర్‌‌‌‌: అదేనే. మేం పనిచేసే అడుగుతున్నం. డొల్లమాటలు చెప్తలేం. దయచేసి మీ ఆశీర్వాదం కావాలే. మీరు ఒక్కరు నాకు సహకరిస్తే, మావోళ్లు ఏం చెప్తున్నరు అంటే సారుకు బాగుంది. బ్రహ్మాండమైన ఇన్‌‌‌‌ఫ్లుయెన్స్‌‌‌‌ ఉందంటున్నరు.

జగన్నాథం: లేదు సార్‌‌‌‌ నేను అంత పెద్దోన్ని కాను.
కేటీఆర్‌‌‌‌: అన్న మావోళ్లు చెప్పందే మీరు ఎంత పెద్ద వ్యక్తో, మీకు ఎంత శక్తి ఉందో చెప్పందే నేను మీకు ఫోన్‌‌‌‌ చేస్తనా. అర్థం చేస్కోండి. ఇది నా కోసమో, మీ కోసమో కాదు. కమ్యూనిటీకి పనిచేసినం. ఆడ  మీ గ్రామానికి మిషన్‌‌‌‌ భగీరథ అయింది. మీకు జస్ట్‌‌‌‌ ఐడియా కోసం చెప్తున్న మీ నియోజకవర్గంలో 79 వేల మందికి రైతుబంధు వస్తుంది. 43 వేల మందికి పెన్షన్లు వస్తున్నయి. ఇవన్నీ ఇదివరకు లేని కార్యక్రమాలు. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మీబోటి పెద్దలు ఆశీర్వాదం ఇస్తే ఇంకింత ఉత్సాహంగా పనిచేయబుద్ధి అయితది.
జగన్నాథం: సార్‌‌‌‌ ఒక్క చిన్న విషయం సార్‌‌‌‌ ఏమనుకోవద్దు. రైతుబంధు అనేది మంచి పథకమే. దానికో లిమిట్‌‌‌‌ ఉండాలే.

కేటీఆర్‌‌‌‌: బరాబర్‌‌‌‌ పెడుదామన్న.
జగన్నాథం: వ్యవసాయం చేసేటోళ్లకే ఇయ్యాలే. సుట్టూ ఖనీలు పాతి గుట్టలకు, వందల ఎకరాల భూములున్నోళ్లకు ఇస్తే పెట్టుబడిదారులు, పెద్దపెద్ద రైతులు, వ్యవసాయం చేయనోళ్లే బాగుపడుతున్నరు తప్ప వ్యవసాయం చేసే రెండెకరాలు, మూడెకరాలోని వచ్చేది పదివేలు, ఇరవై వేలు. ఆ పథకం పేదోళ్లకు చేసినట్టు లేదు. పెద్దోళ్లకే చేసినట్టు ఉంది.  
కేటీఆర్‌‌‌‌: అన్నా.. తెలంగాణల నీళ్లు లేనప్పుడు యాభై ఎకరాలు ఉన్నా ఒకటే, ఐదెకరాలున్నా ఒక్కటే కదా!

జగన్నాథం: సార్‌‌‌‌ ఎకరానికి పదివేలు ఇస్తున్నరు. నిజంగా వ్యవసాయం చేసేటోళ్లకు ఇయ్యాలే.. కౌలు రైతులకు కూడా ఇయ్యాలే. కానీ కౌలు రైతులకు ఇస్తలేరు.
కేటీఆర్‌‌‌‌: నువ్వే భూస్వామి. ఇయ్యాల ఒకాయనకు ఇస్తవు. వచ్చే సంవత్సరం ఇంకొకయానకు ఇస్తవు. రైతుబంధు ఎట్లా ఇయ్యాలే?

మీటర్లు పెట్టే మోడీ కావాల్నా..  రైతుబంధు ఇచ్చే కేసీఆరా? 

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే మోడీ కావాలో.. రైతుబంధు ఇచ్చి అండగా నిలిచే కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కావాలో మునుగోడు రైతులు తేల్చుకోవాలని మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌ సూచించారు. మంగళవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ నుంచి మునుగోడు నియోజకవర్గంలోని రైతులతో ఆయన టెలికాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. ఏటా రూ.10,500 కోట్లతో రైతులకు ఫ్రీ కరెంట్​ ఇస్తున్నామన్నారు. ఇప్పటి దాకా రైతుల ఖాతాల్లో రూ.58వేల కోట్లు వేసిన ప్రభుత్వం తమదని, రైతులు చనిపోతే బీమా ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకుంటున్నామన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి దాకా ధాన్యం, ఇతర పంటల కొనుగోలుకు రూ.1.17 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. మునుగోడులో ఫ్లోరైడ్‌‌‌‌‌‌‌‌ లేకుండా చేశామని, బీడు భూములను పంటపొలాలుగా మార్చేందుకు లక్ష్మణపల్లె, కిష్టరాయినిపల్లె, శివన్నగూడెం ప్రాజెక్టులు కడుతున్నామని కేటీఆర్ తెలిపారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు కృష్ణా నీళ్లలో మనకు దక్కాల్సిన వాటాలు తేల్చకుండా మోకాలడ్డుతోందని విమర్శించారు.