
బతుకమ్మ దసరా సందర్భంగా ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో శనివారం ఉమ్మడి మెదక్జిల్లాలోని వివిధ విద్యా సంస్థల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. చిన్నారులు సంప్రదాయ దుస్తులను ధరించి బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం రావణాసురుడి బొమ్మను దహనం చేసి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. - వెలుగు, నెట్వర్క్