ఈ వారం గ్లోబల్‌‌‌‌‌‌‌‌ ట్రెండ్స్‌‌‌‌‌‌‌‌, క్యూ2 రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌పై ఫోకస్‌‌‌‌‌‌‌‌

ఈ వారం గ్లోబల్‌‌‌‌‌‌‌‌ ట్రెండ్స్‌‌‌‌‌‌‌‌, క్యూ2 రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌పై ఫోకస్‌‌‌‌‌‌‌‌
  • మంగళవారం ముహూరత్‌‌‌‌‌‌‌‌ ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌
  • దీపావళి బలిప్రతిపద సందర్భంగా బుధవారం సెలవు

ముంబై: ఈ వారం మార్కెట్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌ను గ్లోబల్ ట్రెండ్స్, విదేశీ పెట్టుబడులు, కంపెనీల క్యూ2 ఫలితాలు నిర్ణయిస్తాయని ఎనలిస్టులు భావిస్తున్నారు.  బీఎస్‌‌‌‌‌‌‌‌ఈ, ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈలో మంగళవారం (అక్టోబర్ 21న)  ముహూరత్‌‌‌‌‌‌‌‌ ట్రేడింగ్ (సంవత్ 2082 ప్రారంభం) జరుగుతుంది. రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రేడింగ్ ఉండదు. ముహూరత్ ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌  మధ్యాహ్నం 1:45 నుంచి 2:45 వరకు ఉంటుంది.  అక్టోబర్ 22న దీపావళి బలిప్రతిపద సందర్భంగా మార్కెట్‌‌‌‌‌‌‌‌కు సెలవు.  

రిలయన్స్, హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌‌‌‌‌, ఐసీఐసీఐ బ్యాంక్‌‌‌‌‌‌‌‌  ఫలితాలు మార్కెట్‌‌‌‌‌‌‌‌ డైరెక్షన్‌‌‌‌ను ప్రభావితం చేస్తాయి. గిఫ్ట్‌‌‌‌‌‌‌‌ నిఫ్టీ శుక్రవారం  అర శాతానికి పైగా లాభపడడంతో సోమవారం మార్కెట్‌‌‌‌‌‌‌‌ పాజిటివ్‌‌‌‌‌‌‌‌గా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఈ వారం కోల్గేట్‌‌‌‌‌‌‌‌, హిందుస్తాన్ యూనిలీవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  డాక్టర్ రెడ్డీస్‌‌‌‌‌‌‌‌, ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ లైఫ్‌‌‌‌‌‌‌‌ తమ సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫలితాలను విడుదల చేయనున్నాయి. వీటి రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌ను బట్టి ఈ షేర్ల కదలికలు ఉంటాయి. 

యూఎస్‌‌‌‌‌‌‌‌, చైనా టారిఫ్ ఉద్రిక్తతలు, చమురు ధరలు, కరెన్సీ మార్పిడి వంటివి గ్లోబల్ సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌ను ప్రభావితం చేస్తాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌‌‌‌‌పీఐలు) గత మూడు నెలల తర్వాత అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో నికరంగా రూ.6,480 కోట్లను ఇన్వెస్ట్ చేశారు.  గత వారం సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌ 1.75శాతం, నిఫ్టీ 1.67శాతం పెరిగాయి.