320 కోట్ల ఏళ్ల క్రితం భూమంతా నీళ్లేనంట

320 కోట్ల ఏళ్ల క్రితం భూమంతా నీళ్లేనంట

భూమి.. 71 శాతం నీళ్లతో నిండి, 29 శాతం మాత్రమేనేల కలిగిన నీలి ప్రపంచం. కానీ, ఒకప్పుడు అది నీలిమండలం కాదు.. నీటి ప్రపంచం అని చెబుతున్నారు సైంటిస్టులు. 320 కోట్ల ఏళ్ల క్రితం భూమండలం మొత్తం ఓ మహా సంద్రంగా ఉండేదని, మొత్తం నీటితోనే నిండి ఉండేదని అంటున్నారు. అప్పుడు ఖండాలే వీలేవని చెబుతున్నారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్ సైంటిస్టులు స్టడీ చేసి ఈ విషయాన్ని చెబుతున్నారు.ఆస్ట్రేలియా రాళ్లపై స్టడీ ఈ విషయాన్ని చెప్పేందుకు ఆస్ట్రేలియాలోని పనోరమా ఎడారిలో ఉన్న కొన్ని కొండ రాళ్లను సైంటిస్టులు సేకరించారు. 320 కోట్ల ఏళ్ల క్రితం ఆ రాళ్లు సముద్ర గర్భంలో ఉండేవని చెబుతున్నారు.అక్కడి నుంచి దాదాపు వంద రాళ్లను తీసుకున్న సైంటిస్టులు, వాటిలోని ఆక్సిజన్ 18, ఆక్సిజన్ 16 అనే ఐసోటోపులపై రీసెర్చ్​ చేశారు. ఆ రాళ్లలో ఆక్సిజన్ 16 కన్నా ఆక్సిజన్ 18 ఐసోటోపులు ఎక్కువగా ఉన్నాయని తేల్చారు. ఒకప్పుడు సముద్రాల్లో ఈ రకం ఐసోటోపులే ఎక్కువగా ఉండేవని గుర్తించారు. ఈ రెండు ఐసోటోపుల మధ్య భారంలో తేడా కొద్దిగే అయినా,సెన్సిటివిటీలో మాత్రం చాలా తేడా ఉంటుందని,ఆక్సిజన్ 18 సూపర్ సెన్సిటివ్ అని చెప్పారు. ఆక్సిజన్ 18 ఎక్కువగా ఉందంటే , ఆ టైంలో నేల అనేది అసాధ్యమని తేల్చారు. అయితే, అక్కడక్కడా నేల ఉండి ఉండొచ్చని చెప్పారు. వాళ్ల స్టడీని మరింత ముందుకు తీసుకుపోయేందుకు అరిజోనా నుంచి దక్షిణాఫ్రికా వరకు విస్తరించి ఉన్న రాళ్ల నమూనాలను తీసుకోవాలని నిర్ణయించారు. వాటినీ స్టడీచేసి భూమి రహస్యాలను ఛేదించే పనిలో పడ్డారు.తద్వారా భూమిపై జీవం ఆవిర్భావంలోని మరిన్ని రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారు.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి