హిమాలయ దేశాలను వణికిస్తోన్న భూకంపాలు.. ఈ సారి జమ్మూలో

హిమాలయ దేశాలను వణికిస్తోన్న భూకంపాలు.. ఈ సారి జమ్మూలో

జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌లో అక్టోబర్ 22న రాత్రి 11 గంటల సమయంలో రిక్టర్ స్కేల్‌పై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఈ ప్రాంతంలో 5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. అయితే 24 గంటల్లోపే హిమాలయ దేశాల్లో భూకంపం సంభవించడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

భూకంపం రావడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనలో ఎటువంటి గాయాలు గానీ, ప్రాణ నష్టం గానీ జరిగినట్టు ఎన్సీఎస్ వెల్లడించలేదు. అంతకుముందు ఆదివారం ఉదయం నేపాల్‌లో 6.1 తీవ్రతతో మరోసారి భూకంపం సంభవించింది. రాజధాని ఖాట్మండుకు పశ్చిమాన 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధాడింగ్‌లో భూకంప కేంద్రం ఉంది.