40 నిమిషాల్లో రెండు సార్లు భూకంపం..పరుగులు తీసిన జనం

40 నిమిషాల్లో రెండు సార్లు భూకంపం..పరుగులు తీసిన జనం

నేపాల్ను భూకంపం వణించింది. బగ్‌లుంగ్ జిల్లాలోనే  రెండు సార్లు భూమి కంపించింది. తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 4.7, 5.3 తీవ్రతతో రెండు భూమి కంపించిందని నేపాల్‌లోని నేషనల్ ఎర్త్‌క్వేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది. 

బగ్లుంగ్ జిల్లా చౌర్ చుట్టూ  తెల్లవారుజామున 1.23 గంటలకు 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత  2:07 గంటలకు రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో మరోసారి భూమి కంపించిందని నేపాల్ నేషనల్ ఎర్త్‌క్వేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ట్వీట్ చేసింది. అయితే ఈ భూకంపాల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని పేర్కొంది. 

అటు ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో స్వల్ప భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 2.19 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.1గా నమోదయింది.  భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయ  నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అర్థరాత్రి ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.