కరోనా డెత్ రిస్క్ తగ్గాలంటే తక్కువ తినాలె!!

కరోనా డెత్ రిస్క్ తగ్గాలంటే తక్కువ తినాలె!!

తమ ప్రజలకు యూకే పిలుపు
లండన్: ఊబకాయులకు కరోనాతో రిస్క్ ఎక్కువగా ఉంటుందని ఓ సర్వే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తమ పౌరులు తక్కువగా తినాలని బ్రిటన్ ప్రభుత్వం ఆ దేశస్థులను ఆదేశించింది. తక్కువ తినడవ వల్ల బరువు తగ్గుతారని, తద్వారా కరోనా వల్ల చనిపోయే రిస్క్ తగ్గుతుందని బ్రిటన్ జూనియర్ హెల్త్ మినిస్టర్ హెలెన్ వాట్లే సోమవారం తెలిపారు. బాడీ మాస్‌ ఇండెక్స్ 40కిపైగా ఉన్న వారికి కరోనా వల్ల మృతి చెందే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని వాట్లే వాట్లే పేర్కొన్నారు.

జంక్ ఫుడ్‌పై యూకే కొత్తగా మరిన్ని ఆంక్షలను విధించింది. దేశ ఒబెసిటీ రేటు పెరుగుతున్న దృష్ట్యా జంక్ ఫుడ్ అడ్వర్టయిజింగ్‌ను కంట్రోల్ చేయడానికి ఆంక్షలు విధించనున్నట్లు వాట్లే తెలిపారు. ఫ్యాట్, షుగర్, సాల్ట్‌ శాతం ఎక్కువగా ఉన్న ఫుడ్స్‌ యాడ్స్‌ను రాత్రి 9 గంటలలోపు ప్రసారం చేయడంపై బ్యాన్ విధించారు. ఈ విషయాన్ని బ్రిటన్ హెల్త్‌ అండ్ సోషల్ కేర్ డిపార్ట్‌మెంట్ సోమవారం తెలిపింది.