నన్ను మెడ పట్టి బయటకు పంపి ఐదేండ్లు : ఎంపీ ఈటల రాజేందర్

నన్ను మెడ పట్టి బయటకు  పంపి ఐదేండ్లు : ఎంపీ ఈటల రాజేందర్

హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్  తనను మెడ పట్టి బయటికి పంపి ఐదేళ్లు అవుతోందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్  తెలిపారు. పార్టీలు మారడం అంటే బట్టలు మార్చినంత ఈజీ కాదని, తాను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారమంతా చిల్లర ముచ్చటేనని చెప్పారు. శామీర్ పేటలోని తన నివాసంలో మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభతో కలిసి ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం తనను బర్తరఫ్  చేయడమే కాకుండా, తన కోళ్ల ఫారాలను కూల్చివేసి, చట్టబద్ధంగా కొనుక్కున్న భూములను కూడా లాక్కుందని ఈటల చెప్పారు.

కేసీఆర్ హయాంలో జరిగిన దోపిడీని కక్కిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి  పాలన కూడా అబద్ధాలతోనే సాగుతోందని, మీడియాను మేనేజ్ చేస్తూ, కోర్టులను కూడా ప్రభావితం చేసే స్థాయికి వెళ్లారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ముగ్గురు ఎంపీలం కలిసి జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చించుకున్నట్లు చెప్పారు.