కేసీఆర్ కు అధికారం, కుర్చీపైనే ప్రేమ

కేసీఆర్ కు అధికారం, కుర్చీపైనే ప్రేమ

1200 మంది ప్రాణత్యాగం చేస్తేనే తెలంగాణ వచ్చిందన్నారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్. కానీ కేసీఆర్ మాత్రం తన పోరాటం వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పుకుంటున్నారన్నారు.  పాదయాత్రలో భాగంగా ఐదోరోజు జమ్మికుంట మండలం పాపక్కపల్లిలో ఈటల మాట్లాడారు. గులాబి జెండాకు ఓనర్లని చెప్పడం తప్పా అని ప్రశ్నించారు. ఉద్యమంలో ఉన్నాను కాబట్టే TRSలో నాకు పదవులు వచ్చాయన్నారు. దళితులకు సీఎం కేసీఆర్ చేసింది శూన్యం అన్నారు.

2023లో తెలంగాణలో కాషాయం జెండా ఎగరేస్తామన్నారు. కేసీఆర్ రాజకీయ భవిష్యత్ ముగిసిపోతుందన్నారు. తాను ప్రజల గుండెల్లో మనిషినన్నారు. తెలంగాణ మొత్తం హుజురాబాద్ వైపు చూస్తోందన్నారు. కేసీఆర్ కు అధికారం, కుర్చీపైనే ప్రేమ,ప్రజల బాగోగులు పట్టవన్నారు. బానిసను కాదన్న ఈటల..ఆత్మగౌరవ బావుట ఎగురవేసిందుకు వచ్చానన్నారు. టీఆర్ఎస్ కుట్రలు తిప్పి కొట్టి తనను గెలిపించాలన్నారు.