
కేసీఆర్ అహంకారానికి హుజురాబాద్ ప్రజలు ఘోరి కడతారన్నారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్. నిర్మల్ సభలో మాట్లాడిన ఈటల.. యావత్ తెలంగాణ తన వెంట ఉందన్నారు. హుజురాబాద్ లో ఎప్పుడూ ఎన్నిక వచ్చిన కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు. దేశాన్ని బీజేపీ గొప్పగా పాలిస్తుందన్నారు ఈటల రాజేందర్. BJP అధికారంలోకి రాగానే విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. స్వాతంత్ర్య దినం జరుపుకోలేని దుస్థితిలో తెలంగాణ ఉందన్నారు ఈటల