టీఆర్ఎస్‌కు ఏమైనా వందేళ్ల చరిత్ర ఉందా.?

టీఆర్ఎస్‌కు ఏమైనా వందేళ్ల చరిత్ర ఉందా.?

రాష్ట్రమంతా రైతుబంధు ఇచ్చినట్లుగా.. దళితబంధు కూడా ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్. TRS పుట్టి 21 ఏళ్లు అయిందని.. 19 ఏళ్లు తాను అదే పార్టీలో ఉన్నానన్నారు. మధ్యలో వచ్చి మధ్యలో పోయాను అనడానికి TRS పార్టీకి వందేళ్ల చరిత్ర ఉందా అని ప్రశ్నించారు ఈటల. ముఖ్యమంత్రి సీటుకు ఎసరు పెట్టినట్లు ఆరోపించడం కూడా సిగ్గు చేటన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కందుగులలో జరగిన చేరికల కార్యక్రమంలో మాట్లాడారు ఈటల.