నేషనల్ ఈబీసీ కమిషన్ ఏర్పాటు చేయండి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఈబీసీ నేషనల్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి వినతి

నేషనల్ ఈబీసీ కమిషన్ ఏర్పాటు చేయండి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఈబీసీ నేషనల్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి వినతి

హైదరాబాద్, వెలుగు: కేంద్రంలో జాతీయ ఈబీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఈబీసీ నేషనల్ ప్రెసిడెంట్ వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి కోరారు. శనివారం దిల్ ఖుష్ గెస్ట్ హౌస్ లో కిషన్ రెడ్డిని కలిసి ఈబీసీ సమస్యలపై ఆయన వినతిపత్రం అందజేశారు. ఈబీసీల అభివృద్ధికి మంత్రిత్వశాఖ, ఈబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటినీ అగ్రవర్ణాలలోని నిరుపేదలకు వర్తింపజేయాలని రవీందర్ రెడ్డి తన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ అంశాలపై  కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని, ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని రవీందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.