కరోనా కాలంలో ఎన్నికల నిర్వహణకు సలహాలు ఇవ్వండి: ఈసీ

కరోనా కాలంలో ఎన్నికల నిర్వహణకు సలహాలు ఇవ్వండి: ఈసీ

రాజకీయ పార్టీలను కోరిన ఎన్నికల కమిషన్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎలక్షన్ క్యాంపెయిన్, పబ్లిక్ మీటింగ్స్‌ను నిర్వహించడంపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్​ ఇండియా కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు జూలై 31లోగా ఇందుకు అవసరమైన సలహాలు, సూచనలు చేయాల్సిందిగా రాజకీయ పార్టీలను కమిషన్ కోరింది. ‘జూలై 31, 2020లోగా మీ అభిప్రాయాలు, సూచనలను మాకు తెలియజేయండి. తద్వారా కరోనా కాలంలో ఎలక్షన్స్‌ కోసం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయడానికి అవసరమైన గైడ్‌లైన్స్‌ను తయారు చేస్తాం’ అని పార్టీలకు ఈసీ లెటర్ పంపింది.

ఈ ఏడాది ద్వితీయార్థంలో బిహార్‌‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వైరస్ వ్యాప్తి పెరుగుతున్నందున ఈ ఎన్నికల నిర్వహణ కరోనా వ్యాప్తికి సూపర్ స్ప్రెడర్‌‌ ఈవెంట్‌గా మారనీయొద్దని ఎన్నికల కమిషన్‌కు బిహార్‌‌లోని విపక్ష పార్టీ విజ్ఞప్తి చేశాయి. వచ్చే నవంబర్ 29న ప్రస్తుత బిహార్ అసెంబ్లీ పదవీకాలం ముగుస్తుంది. దీంతో కొత్త అసెంబ్లీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.