
ఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘించిన నేతలపై కఠిన నిర్ణయం తీసుకుంది ఈసీ. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ,బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ నేత అజంఖాన్, కేంద్ర మంత్రి మేనకా గాంధీ ప్రచారంపై ఆంక్షలు విధించారని ఆంక్షలు విధించింది ఎన్నికల కమిషన్ . మతపరమైన వ్యాఖ్యాలు చేశారంటూ యోగి ఆదిత్యానాథ్ 72 గంటలు, మాయావతి 48 గంటల పాటు ప్రచారం చేయకూడదని నిషేదం విధించింది. జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అజంఖాన్ 72 గంటలు, ఓట్లను బట్టి ఏబీసీడీ వర్గాలుగా విభజిస్తామని మాట్లాడిన మేనకా గాంధీ 48 గంటలు ఏలాంటి ప్రచారాలు, మీటింగ్ల లో పాల్గొనకూడదని ఆదేశాలిచ్చింది ఈసీ. సుప్రీంకోర్టు చివాట్లతో ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది.