ఎన్నికల్లో కలెక్టర్లు, ఎస్పీలే కీలకం

ఎన్నికల్లో కలెక్టర్లు,  ఎస్పీలే కీలకం
  •  సరిహద్దు జిల్లాల్లో అలర్ట్​గా ఉండాలి: ఈసీ
  • అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై రివ్యూ

హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో కలెక్టర్లు, ఎస్పీల పాత్రే కీలకమని ఢిల్లీ నుంచి వచ్చిన ఈసీ బృందం స్పష్టం చేసింది. రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఓటర్ల జాబితా దగ్గర నుంచి కౌంటింగ్ వరకు పకడ్బందీ ప్లాన్ అమలు చేయాలని ఆదేశించింది. 

ఎన్నికల్లో కలెక్టర్లు, ఎస్పీలే కీలకం

స్టేట్ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధత, ఏర్పాట్లపై ఢిల్లీకి చెందిన ఈసీ బృందం శుక్రవారం కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (ఎంసీహెచ్​ఆర్డీ)లో సమావేశమైంది. ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించింది. అదేవిధంగా, ఏ జిల్లాలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అడిగి తెలుసుకుంది. సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి.. భద్రతా ఏర్పాట్లు ఎలా చేపట్టాలనే దానిపై సమీక్షించింది. ప్రధానంగా ఓటింగ్ శాతం పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఇక్కడి అధికారులతో చర్చించింది. 

స్ట్రాంగ్ రూమ్​ల భద్రతపై ఆరా తీసింది. ఎన్ని ఈవీఎంలు ఉన్నాయి? వాటిలో ఎన్ని పని చేస్తున్నాయి? వీవీ ప్యాట్లు ఉన్నాయా? వాటి పరిస్థితి ఏంటి? అన్న అంశాలపై సమాచారం సేకరించింది. శనివారం ప్రభుత్వ కార్యదర్శులతో ఈసీ బృందం భేటీ కానుంది. ఈ సమావేశంలో సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, ఆర్కే గుప్తా, సంజయ్ కుమార్, అండర్ సెక్రటరీ అవినాశ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ హిర్దేశ్​ కుమార్, సీఈవో వికాస్ రాజ్, జాయింట్ సీఈవో సత్యవాణి పాల్గొన్నారు.