హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్య ..

హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్య ..
  • వరంగల్​కు అంబర్ కిషోర్ ఝా, నిజామాబాద్​కు కల్మేశ్వర్ నియామకం
  • రంగారెడ్డి కలెక్టర్​గా భారతి హోలికేరి
  • మేడ్చల్​కు గౌతం, యాదాద్రికి హనుమంతు, 
  • నిర్మల్ కు ఆశీశ్​ సంగ్వాన్బదిలీ చేసిన పోస్టులకు 
  • కొత్త అధికారులను ఎంపిక చేసిన ఈసీ 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో ఇటీవల పలువురు అధికారులపై బదిలీ వేటు వేసిన కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ).. ఆయా పోస్టులకు కొత్త అధికారులను ఎంపిక చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్యానెల్ జాబితా నుంచి అధికారులను ఎంపిక చేసిన ఈసీ.. ఆ లిస్టును శుక్రవారం రాష్ట్ర సర్కార్ కు పంపించింది. ఈసీ ఆదేశాలకు అనుగుణంగా కొత్త అధికారులకు పోస్టింగ్ ఇస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ అధికారులు శుక్రవారం సాయంత్రం 4 గంటలలోపు బాధ్యతలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, ఇద్దరు సెక్రటరీలు, ఇద్దరు కమిషనర్లు, నాలుగు జిల్లాలకు కలెక్టర్లు, ముగ్గురు పోలీసు కమిషనర్లు, 10 మంది ఎస్పీలను ఈసీ ఎంపిక చేసింది. 

కొత్త ఆఫీసర్లు వీళ్లే.. 

అడిషనల్ డీజీ హోదాలో స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్​గా ఉన్న సందీప్ శాండిల్య (1993 బ్యాచ్)ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్​గా నియమించారు. వరంగల్ సీపీగా అంబర్ కిషోర్ ఝా, నిజామాబాద్ సీపీగా కల్మేశ్వర్ నియమితులయ్యారు. ఇంతకుముందు హైదరాబాద్ సీపీగా ఉన్న సీవీ ఆనంద్, వరంగల్ సీపీ రంగనాథ్, నిజామాబాద్ సీపీ సత్యనారాయణపై ఈసీ బదిలీ వేటు వేయడంతో కొత్త సీపీలను నియమించారు. ఇక ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శిగా సునీల్‌‌‌‌‌‌‌‌ శర్మ, ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌గా జ్యోతిబుద్ధ ప్రకాశ్‌‌‌‌‌‌‌‌, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీప్రసాద్‌‌‌‌‌‌‌‌, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌‌‌‌‌‌‌‌గా క్రిస్టినా జడ్​చొంగ్తూ నియమితులయ్యారు.

 ఇన్ని రోజులు ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలు సీఎస్ శాంతికుమారి చూస్తుండగా.. ఇప్పుడు సునీల్ శర్మకు అప్పగించారు. రంగారెడ్డి కలెక్టర్​గా భారతీ హోలీకేరీ, మేడ్చల్‌‌‌‌‌‌‌‌ మల్కాజ్​గిరి కలెక్టర్‌‌‌‌‌‌‌‌గా గౌతం, యాదాద్రి భువనగిరి కలెక్టర్‌‌‌‌‌‌‌‌గా హనుమంతు కొడింబా, నిర్మల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌గా ఆశీష్ సంగ్వాన్​ను నియమించారు. సంగారెడ్డి ఎస్పీగా రూపేశ్, మహబూబ్​నగర్ ఎస్పీగా హర్షవర్ధన్, భూపాలపల్లి ఎస్పీగా కిరణ్ ఖారే, కామారెడ్డి ఎస్పీగా సింధూశర్మ, నాగర్ కర్నూల్ ఎస్పీగా వైభవ్ రఘునాథ్, సూర్యాపేట ఎస్పీగా రాహుల్ హెగ్డే, మహబూబాబాద్ ఎస్పీగా పాటిల్ సంగ్రాం సింగ్, జగిత్యాల ఎస్పీగా సన్‌‌‌‌‌‌‌‌ప్రీత్ సింగ్, నారాయణపేట ఎస్పీగా యోగేశ్ గౌతం, జోగులాంబ గద్వాల ఎస్పీగా రితిరాజ్ నియమితులయ్యారు. 

బదిలీలతో పోస్టులు ఖాళీ.. 

ఈసీ ఆదేశాల మేరకు ఐఏఎస్, ఐపీఎస్​ల బదిలీలతో కొన్ని పోస్టులు ఖాళీ అయ్యాయి. ఐపీఎస్​ల బదిలీలతో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కొన్ని ఖాళీలు ఏర్పడగా.. ఆ బాధ్యతలను సమీపంలోని డీసీపీలకు కేటాయించారు. ఖాళీ అయిన స్థానాల్లో త్వరలోనే కొత్త ఐపీఎస్​లను నియమించనున్నారు. కొన్ని శాఖల్లో ఖాళీ అయిన ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేయనున్నారు. వీటికి ఇన్ చార్జులను నియమించే అవకాశం ఉంది. ఇప్పటిదాకా ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సునీల్ శర్మకు ఇప్పుడు ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న క్రిస్టీనా జడ్ చొంగ్తూను కమర్షియల్​ట్యాక్స్​ కమిషనర్​గా నియమించారు. వుమెన్ అండ్ చైల్డ్​ వెల్ఫేర్​ సెక్రటరీ అండ్​ కమిషనర్​గా ఉన్న భారతీ హోలీకేరిని రంగారెడ్డి కలెక్టర్​గా, సెర్ప్ సీఈఓగా ఉన్న గౌతంను మేడ్చల్ కలెక్టర్​గా,  సీసీఎల్ఏ స్పెషల్​ఆఫీసర్​గా ఉన్న ఆశీష్ సంగ్వాన్ ను నిర్మల్ కలెక్టర్​గా బదిలీ చేశారు.