
లక్ష్మీ’S NTR చిత్ర విడుదల వివాదంలో కడప జాయింట్ కలెక్టర్ ను బదిలీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలంటూ ఆదేశించింది.
సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యేవరకు.. అంటే.. ఈనెల 19వరకు లక్ష్మీ’S NTR సినిమాను ఏపీలో విడుదల చేయకూడదని ఇప్పటికే ఈసీ ఆదేశాలు ఉన్నాయి. ఐతే… ఏపీ అంతటా నిషేధం ఉన్నప్పటికీ.. కడపలోని కొన్ని థియేటర్లలో లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీని ప్రదర్శించారు. జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఇందుకు కారణమని ఈసీ సీరియస్ అయింది.
సినిమాను గడువు ముగిసే వరకు ఎక్కడా ప్రదర్శించకూడదని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది మరోసారి సూచించారు.