
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పీడ్ పెంచింది. ఓటర్ల తుది జాబితా కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆగస్టు 28న అన్ని గ్రామ పంచాయతీల్లో వార్డుల వైజ్ గా లిస్ట్ డిస్ ప్లే చేయనున్నట్లు వెల్లడించింది. ఆగస్టు 29న జిల్లా స్థాయి ఆగస్టు 30న మండలస్థాయిలో అన్ని పొలిటికల్ పార్టీలతో సమావేశం నిర్వహించనుంది. ఆగస్టు28 నుంచి 30 వరకు ఓటర్ జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి వాటిని పరిష్కరించి సెప్టెంబర్ 2న తుది ఓటర్ జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపింది.
తెలంగాణ కేబినెట్ సమావేశం ఆగస్టు 29న మద్యాహ్నం 3:30గంటలకు జరగనుంది.సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుందిసెప్టెంబర్ 30 లోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికలపై స్పష్టత కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లు, పంచాయతీ రాజ్చట్ట సవరణ ఆర్డినెన్స్కేంద్రం వద్ద పెండింగ్లో ఉండటంతో రిజర్వేషన్లపై ఇప్పటికే న్యాయ నిపుణుల సలహా తీసుకుంది సబ్ కమిటీ. ఆగస్టు 28 లోపు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనుంది . సబ్ కమిటీ ఇచ్చే నివేదికపై కేబినెట్ లో చర్చించి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం