షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ

 షుగర్  లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు :  ఈడీ

తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక ఆరోపణలు చేసింది.   షుగర్ లెవెల్ పెరిగేలా కేజ్రీవాల్ జైలులో బంగాళదుంపలు,  మామిడిపండ్లు, స్వీట్లు  తింటున్నారని, చక్కెరతో కూడిన టీ తాగుతున్నారని  రౌస్ అవెన్యూ  కోర్టుకు ఈడీ తెలిపింది.  మామిడిపండ్లు తింటే షుగర్  లెవెల్ పెరిగితే బెయిల్ అడగవచ్చు అన్నది కేజ్రీవాల్ ప్లాన్ అని ఈడీ కోర్టుకు తెలిపింది. 

దీంతో జైలులో  కేజ్రీవాల్ డైర్ట్ ఛార్ట్ సమర్పించాలని అధికారులను కోర్టు ఆదేశించింది. తుదుపరి వాదనలను రేపు వింటామని కోర్టు తెలిపింది.  అయితే ఈడీ ఆరోపణలను  కేజ్రీవాల్‌ తరుపు లాయర్  వివేక్ జైన్ కొట్టిపారేశారు.  కేవలం మీడియా కోసమే దర్యాప్తు సంస్థ ఈ ఆరోపణలు చేస్తోందన్నారు.  అరవింద్ కేజ్రీవాల్ టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారు.  

కేజ్రీవాల్ ఇంట్లో వండిన ఆహారం తినేందుకు కోర్టు ఇప్పటికే అనుమతి ఇచ్చింది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుల సంబంధించి  మనీలాండరింగ్ కేసులో మార్చి 21న ఈడీ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది.