ఎడ్ సెట్ దరఖాస్తు గడువు పెంపు: మే 1 వరకు దరఖాస్తు

ఎడ్ సెట్ దరఖాస్తు గడువు పెంపు: మే 1 వరకు దరఖాస్తు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీఈడీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఎడ్ సెట్ దరఖాస్తు గడువును మే1 వరకు పొడిగించినట్లు టీఎస్​ఎడ్ సెట్ కన్వీనర్ ఏ.రామకృష్ణ తెలిపారు. ఇప్పటివరకు 25 వేలకు పైగా దరఖాస్తులు అందాయని చెప్పారు. అభ్యర్థులు ఎలాంటి ఫైన్ లేకుండా మే 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. కాగా, మే18న ఎడ్ సెట్ ఎగ్జామ్ జరగనుంది.