
క్యాసినో వ్యవహారంలో వ్యాపారవేత్త బుచ్చిరెడ్డిని విచారణ కొనసాగుతోంది. ఆర్థిక అవకతవకలకు సంబంధించి అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఉదయం ఈడీ ఆఫీసుకు వచ్చిన ఆయనను కాసేపు ప్రశ్నించిన అధికారులు 6 సంవత్సరాల బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకురావాలని చెప్పారు. వాటిని తీసుకొచ్చిన అనంతరం బ్యాంక్ స్టేట్మెంట్ ఆధారంగా అధికారులు బుచ్చిరెడ్డి విచారణ కొనసాగిస్తున్నారు. చికోటి ప్రవీణ్ సన్నిహితుడైన మాధవరెడ్డితో లింకులున్న వారందరికీ ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలోనే బుచ్చిరెడ్డిని ఫెమా చట్టం కింద విచారణకు పిలిచారు.
క్యాసినో బిజినెస్ లో తనకు 5శాతం వాటా ఉందని బుచ్చిరెడ్డి చెబుతున్నారు. ఈ ఏడాది జనవరిలో క్యాసినో ఆడేందుకు నేపాల్ వెళ్లినట్లు స్పష్టం చేశారు. తనతో పాటు మరో 10 మంది నేపాల్ వచ్చారన్న బుచ్చిరెడ్డి.. క్యాసినో ఆడేందుకు ఇండియాలోనే డబ్బు డిపాజిట్ చేసినట్లు చెప్పారు. అక్కడ గెలిచిన ప్రైజ్ మనీని కూడా ఇక్కడే తీసుకున్నట్లు అధికారులకు వివరించారు. క్యాసినో ఆడేందుకు వెళ్లినప్పుడు కేవలం రూ.15,000 తీసుకెళ్లేందుకు మాత్రమే అనుమతిస్తారని, ఇందులో మనీలాండరింగ్ కోణం ఏదీ లేదని బుచ్చిరెడ్డి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.