
హైదరాబాద్, వెలుగు: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని బుధవారం రెండో రోజూ ఈడీ ప్రశ్నించింది. ఉదయం 11 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీస్‌కు వచ్చిన ఆయనను దాదాపు 10 గంటల పాటు విచారించింది. విదేశీ కంపెనీలకు వెళ్లిన పెట్టుబడులపై ఆరా తీసింది. ఈడీ అడిగిన కొన్ని ప్రశ్నలకు మంచిరెడ్డి నుంచి సరైన సమాధానాలు రాలేదని తెలిసింది. ఫారిన్ టూర్‌లో జరిపిన ట్రాన్సాక్షన్స్, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లపై ఈడీ సమగ్రంగా విచారించినట్లు సమాచారం. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్‌యాక్ట్ (ఫెమా) కింద 2015లో రిజిస్టరైన కేసుల్లో మంగళవారం నుంచి మంచిరెడ్డిని ఈడీ విచారిస్తోంది. గురువారం మరోసారి విచారణకు రావాలని ఆదేశించింది.