
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వ్యాప్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) మంగళవారం దాడులు నిర్వహించింది. ఆసుపత్రి నిర్మాణ కుంభకోణానికి సంబంధించి ఢిల్లీ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ నివాసం సహా పలు ప్రదేశాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది.మొత్తం ఢిల్లీలో 12 ప్రాంతాల్లో కేంద్ర ఏజెన్సీలు సోదాలు చేసింది. ఢిల్లీ ప్రభుత్వం హయాంలో ఆస్పత్రుల నిర్మాణం లో జరిగిన రూ. 5వేల 590 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
2018-19లో 5వేల 590కోట్ల రూపాయలతో 11 గ్రీన్‌ఫీల్డ్ ,13 బ్రౌన్‌ఫీల్డ్‌లతో సహా 24 ఆసుపత్రి ప్రాజెక్టులు మంజూరు చేశారని ఢిల్లీ ACB దర్యాప్తులో తేలింది. ఈ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున ఆర్థిక దుర్వినియోగం జరిగిందని తెలిపింది. ACB ఢిల్లీ నమోదు చేసిన FIR ఆధారంగా ఈ కుంభకోణంలో ED కేసు నమోదు చేసింది. ఆ ప్రాజెక్టులు భరద్వాజ్ తోపాటు ఇతరులకు ప్రయోజనం కలిగేలా ఆర్థిక దుర్వినియోగం అని ED అనుమానిస్తోంది.
ఈ కేసుకు సంబంధించి మాజీ ఆరోగ్య మంత్రులు సౌరభ్ భరద్వాజ్, సత్యేంద్ర జైన్ లు విచారణలో ఉన్నారు. ఈ విషయానికి సంబంధించి ECIR (ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) ను నమోదు ED చేసింది.
ఆప్ పార్టీ నేత ఇంట్లో ఈడీ సోదాలపై ఆ పార్టీ నేత, ఢిల్లీ మాజీ సీఎం అతిషీ స్పందించింది. ప్రధాని మోదీ జీ డిగ్రీపై దేశవ్యాప్తంగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి..- మోదీజీ డిగ్రీ నకిలీదా? అనే చర్చ నుంచి దృష్టిని మళ్లించేందుకు ఈ దాడి జరిగిందని అతిషీ ఆరోపించింది.