నామా ఇంట్లో, కంపెనీలల్లో ముగిసిన ఈడీ సోదాలు

నామా ఇంట్లో, కంపెనీలల్లో ముగిసిన ఈడీ సోదాలు

ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఇళ్లు , కంపెనీల్లో ఈడీ సోదాలు ముగిశాయి. ఖమ్మం, హైదరాబాద్ లో మొత్తం 6 చోట్ల సోదాలు చేశారు ఈడీ అధికారులు. నిన్న ఉదయం 7 గంటల నుంచి ఇవాళ ఉదయం 4 గంటల వరకు తనిఖీలు జరిగాయి. 20 గంటల పాటు నామా ఇళ్లు, ఆఫీసుల్లో కీలక పత్రాలు, కంప్యూటర్లు, బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి వివరాలను పరిశీలించినట్టు తెలుస్తోంది. ఈ సోదాల్లో కీలక ఆధారాలు సేకరించింది ఈడీ. నగదు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే ప్రాజెక్టుకు సంబంధించి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మదుకాన్ కంపెనీ డైరెక్టర్ల స్టేట్మెంట్ కూడా ఈడీ అధికారులు రికార్డు చేసుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఇంట్లో నామా సమక్షంలో సోదాలు చేశారు అధికారులు. సోదాలు పూర్తయిన తర్వాత నామాకు నోటీసులు ఇచ్చింది ఈడీ. విచారణకు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని నోటీసులో తెలిపారు. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్న ఈడీ అధికారులు.