హైదరాబాద్: హైదరాబాదులో మరో సారి ఈడీ సోదాలు జరిగాయి. భువన తేజ రియల్ ఎస్టేట్స్ ఇన్ఫ్రా కంపెనీపై ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రీ లాంచ్ పేరుతో 70 కోట్ల పైగా భువన తేజ ఇన్ఫ్రా కంపెనీ వసూలు చేసినట్లు ఇప్పటికే హైదరాబాద్ సీసీఎస్లో భువన తేజపై కేసు నమోదైంది. సీసీఎస్ కేసు ఆధారంగా ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. హైదరాబాద్లో నాలుగు చోట్ల ఈడీ సోదాలు చేస్తుండటం గమనార్హం. కంపెనీ ఎండీ సుబ్రహ్మణ్యంతో పాటు పలువురు ఇండ్లలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ సిటీ చుట్టూ రియల్టర్లు, బిల్డర్లు, ఏజెంట్లు మోసాలకు పాల్పడుతున్నారు. ప్రీ లాంచ్‌ల పేరుతో కొనుగోలుదారులను మాయ చేస్తున్నారు. అగ్రిమెంట్ల ప్రకారం అపార్ట్‌మెంట్లు, విల్లాల నిర్మాణాలు పూర్తి చేయడం లేదు. గడువులోగా ఫ్లాట్లను, ప్లాట్లను అప్పగించడం లేదు. చెప్పిన సౌలతుల (ఎమినిటీస్)ను కల్పించడం లేదు. ముందు చెప్పేదొకటి.. ఆ తర్వాత చేసేదొకటి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
Also read:- నిధులు కాజేసింది వీళ్లేనంటూ రిపోర్టులో సినీ ప్రముఖుల పేర్లు !
ఒక ప్రాజెక్టును చూపించి అడ్వాన్స్‌గా డబ్బులు తీసుకొని, అది కంప్లీట్ చేయకుండానే.. ఆ నిధులను మరో ప్రాజెక్టుకు మళ్లిస్తున్నారు. బ్యాంకుల్లో లోన్లు తీసుకొని అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు, విల్లాలు కొనుగోలు చేసినోళ్లేమో.. అవి తమ చేతికి అందక, సొంతింటి కల నెరవేరక ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ఈఎంఐల భారంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్వరగా ప్రాజెక్టులు పూర్తి చేయాలని నెలలు, సంవత్సరాల తరబడి రియల్టర్లు, బిల్డర్లు చుట్టూ తిరిగి అలసిపోతున్నారు.

