లోన్ యాప్స్ కేసులో స్పీడ్ పెంచిన ఈడీ

లోన్ యాప్స్ కేసులో స్పీడ్ పెంచిన ఈడీ

లోన్ యాప్స్ కేసులో ఈడీ స్పీడ్ పెంచింది. హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్లలో ఇప్పటికే 100కు పైగా లోప్ యాప్స్ మోసానికి సంబంధించిన కేసు నమోదయ్యాయి. ఈ కేసుల్లో  28మంది నిందితులు అరెస్ట్ అవగా..చైనాకు చెందిన మరికొంతమందికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే హైదరాబాద్ సీసీఎస్ ద్వారా నమోదైన మరో 100 లోన్ యాప్ మోసం కేసులను చేపట్టాలని ఈడీ నిర్ణయించింది. ముఖ్యంగా లోన్ తీసుకున్న మహిళలను మార్ఫింగ్ చేసిన నగ్న ఫొటోలతో వేధించడాన్ని ఈడీ సీరియస్ గా తీసుకుంది.

లోన్ యాప్ మోసాలకు సంబంధించి ఈడీకి దాదాపు 45కేసుల ఎఫ్ఐఆర్ లు రాగా..మరికొన్నింటి కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ లోన్ యాప్ కేసుల్లో చైనాకు చెందిన 10మందిని ఈడీ సహా సీసీఎస్ పోలీసులు వాంటెడ్ లిస్ట్ లో చేర్చారు. ఇటువంటి నేరాలకు పాల్పడుతున్న బోగస్ సంస్థలపై చర్యలు తీసుకునేందుకు ఈడీ సిద్ధమైంది. చైనీస్ నిర్వహిస్తున్న లింక్ యున్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, డోకీపే టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ వంటి దొంగ యాప్ కంపెనీలపై మనీలాండరింగ్ కేసును ఈడీ ఇప్పటికే విచారిస్తోంది. 

ఈడీ విచారణలో అంతర్జాతీయ హవాలా లావాదేవీలు సహా పలు అక్రమ కార్యకలాపాలు వెలుగుచూశాయి. చైనా కంపెనీలతో ముడిపడి ఉన్న షెల్ కంపెనీల ఖాతాల్లోను 50కోట్లను ఈడీ సీజ్ చేసింది. డోకీ పేకి 1268 కోట్ల వసూళ్లతో పాటు 120కోట్ల విదేశీ రెమిటెన్స్ లు ఉన్నట్లు ఈడీ కనుగొంది. ఈ కంపెనీలకు లింక్ చేసిన పేమెంట్ గేట్ వేలు,బ్యాంక్ ఖాతాల ద్వారా 21వేల కోట్ల విలువైన 1.4 కోట్ల లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించింది.

మరిన్ని వార్తల కోసం

సోనియా, రాహుల్కు ఈడీ నోటీసులు

కేసీఆర్ వల్లే రాష్ట్రం దివాళా తీసింది