కేసీఆర్ వల్లే రాష్ట్రం దివాళా తీసింది

కేసీఆర్ వల్లే రాష్ట్రం దివాళా తీసింది

హైదరాబాద్: కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం దివాళా తీసిందని టీపీసీసీ మాజీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో కాంగ్రెస్ రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహిస్తోంది. ఈ సమావేశాల్లో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ డిక్లరేషన్ పై చర్చించనున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలు కీలక అంశాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు చర్చించి తీర్మానాలు చేయనున్నారు. ఈ  వర్క్ షాప్ కు హాజరైన ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్ హయాంలో రాష్ట్రం తీవ్రం అప్పులు ఊబిలో చిక్కుకుపోయిందన్నారు.

కనీసం ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి నెలకొందని ఆరోపించారు. ఇది పూర్తిగా టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమని మండిపడ్డారు. ఇక వర్క్ షాప్ లో ఉదయ్ పూర్ డిక్లరేషన్ పై చింతన్ శిబిర్ లో చర్చిచామన్నా ఆయన... పార్టీని బలోపేతం చేసేందుకు పలు తీర్మానాలు చేసినట్లు తెలిపారు. ప్రజలకు దగ్గరయ్యేందుకు ఏం చేయాలో అవన్నీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తల కోసం...

నాలాలు కబ్జా అయినా పట్టించుకోలేదు

సోనియా, రాహుల్కు ఈడీ నోటీసులు