సంజయ్ రౌత్‌కు ఈడీ మళ్లీ సమన్లు

సంజయ్ రౌత్‌కు ఈడీ మళ్లీ సమన్లు

శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు మళ్లీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు ​​పంపింది. ఈ రోజు (బుధవారం జులై20)న  ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్‌ కేసులో జులై 1న దాదాపు 10గంటల పాటు విచారించిన ఈడీ .. తాజాగా మరోసారి ఆయనకు మళ్లీ సమన్లు ​పంపింది. సంజయ్‌ రౌత్‌ భార్య  వర్షా రౌత్, ఆయన స్నేహితుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన ముంబయిలోని గోరెగావ్‌ పాత్రచాల్‌ భూకుంభకోణం, ఇతర ఆర్థిక వ్యవహారాల్లో చోటుచేసుకున్న నగదు అక్రమ చలామణీకి సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా రౌత్‌కు ఈడీ గతంలో సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

https://twitter.com/ANI/status/1549427858057093121