ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం  : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం  : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

ధర్మారం, వెలుగు: అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం ధర్మారం మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మార్కెట్ యార్డులో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. గత నెలలో బొమ్మరెడ్డిపల్లి లో విషాహారం తిని 100 గొర్రెలు, చామనపల్లి లో కరెంట్ షాక్ తో 40 గొర్రెలు మరణించగా నష్టపరిహారంగా ప్రభుత్వ పరంగా రూ.8.64 లక్షల చెక్కులను బాధితులకు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వంలో ప్రతిఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. అనంతరం నంది మేడారం గ్రామంలో 600 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రూప్లానాయక్, వైస్ చైర్మన్ లింగయ్య, లీడర్‌‌‌‌‌‌‌‌ కాడే సూర్యనారాయణ, ఆర్డీవో గంగయ్య, హౌసింగ్‌‌‌‌ పీడీ రాజేశ్వర్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.