
ప్రైవేట్‌కు దీటుగా సర్కారు పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్నారు. హనుమకొండ లష్కర్‌బజార్‌లోని మర్కాజీ ప్రభుత్వ పాఠశాలలో ప్రైమరీ, హైస్కూల్ కలిపి సుమారు 1000 మంది విద్యార్థులున్నారు. ఇందులో 8 నుంచి 10వ తరగతి వరకు డిజిటల్ క్లాస్‌లు బోధిస్తుండగా, ఇందుకోసం ఏడు డిజిటల్ క్లాస్‌రూంలను ఏర్పాటు చేశారు. కార్పొరేట్‌స్కూళ్లకు దీటుగా ఈ స్కూల్లో రిజల్ట్స్ రావడంతో విద్యార్థుల అడ్మిషన్ల కోసం పోటీ పడుతున్నారు.- వెలుగు, వరంగల్ ఫొటోగ్రాఫర్