ఈడీ ముందుకు చీకోటి ప్రవీణ్

ఈడీ ముందుకు చీకోటి ప్రవీణ్

క్యాసినో గ్యాంబ్లర్ చీకోటి ప్రీవీణ్ కేసులో డొంక కదులుతోంది.  క్యాసినో, మనీ లాండరింగ్ కేసులో  ఈడీ ముందు హాజరయ్యారు .  క్యాసినో, మనీ లాండరింగ్ కేసులో మొత్తం ఆరుగురికి ఈడీ నోటీసులు ఇచ్చింది. విచారణలో భాగంగా చీకోటీ హాజరవ్వగా... మరో ఐదుగురు విచారణకు రావాల్సి ఉంది. క్యాసినో మాటున భారీ హవాలా రాకెట్ నడుస్తున్నట్లు అనుమానిస్తున్న ఈడీ.. ఆ కోణంలో దర్యాప్తు చేయనుంది.

చీకోటి ప్రవీణ్ కు ఐదు రాష్ట్రాల్లోని ప్రముఖులతో లింక్స్ ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి వివరాలు సేకరించేందుకు వివిధ బ్యాంక్ సంస్థల నుంచి అన్ని ఆధారాలు ED తీసుకున్నట్టు సమాచారం. ఐదు రోజులు క్రితం ఏకకాలంలో ఎనిమిది ప్రదేశాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ  సోదాల్లో ఫోన్లు, పాత్రలు గోల్డ్ లాప్ టాప్స్ సీజ్ చేశారు అధికారులు.