ఆగష్టు 10న బీఈడీ సీట్ల కేటాయింపు

 ఆగష్టు 10న బీఈడీ సీట్ల కేటాయింపు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీఈడీ కాలేజీల్లో చేరేందుకు నిర్వహించిన ఎడ్ సెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాల్మెంట్ ఆదివారం నిర్వహించనున్నట్టు సెట్స్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం శనివారమే అలాట్మెంట్ చేయాల్సి ఉంది. కాగా, ఎడ్ సెట్ లో 30,944 మంది క్వాలిఫై అయ్యారు. వీరిలో 17,155 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. సీట్లు అలాటైన అభ్యర్థులు ఈనెల 14లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంది.