చంద్రయాన్ 3 ల్యాండింగ్.. విద్యాశాఖ కీలక ఆదేశాలు

చంద్రయాన్ 3 ల్యాండింగ్.. విద్యాశాఖ కీలక ఆదేశాలు

చంద్రయాన్ 3  ల్యాండింగ్ సందర్భంగా స్కూల్ టైమింగ్​పై  విద్యాశాఖ వెనక్కి తగ్గింది.   స్కూల్ టైమింగ్ లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు విద్యాశాఖ అధికారులు.  ఆగస్టు 23 న  చంద్రయాన్  లైవ్  టెలికాస్ట్ కోసమని  6.30 గంటల వరకు స్కూల్స్  నడపాల్సిన అవసరం లేదని తెలిపారు.

రెసిడెన్షియల్ పాఠశాలలలో విద్యార్థులకు ప్రొజెక్టర్/కె యాన్/టీవీ ల ద్వారా చూపెట్టాలని సూచించారు.   మిగతా పాఠశాలల విద్యార్థులు ఇంటి వద్ద టీవీలో గాని మొబైల్ లో గాని చూడమని అవగాహన కల్పించాలని కోరారు.  ఒ కవేళ రేపు సాయంత్రం చూడ లేకపోతే  తర్వాతి రోజు  స్కూల్ కు రాగానే చూపెట్టాలని ఆదేశించారు. చంద్రయాన్   కార్యక్రమం కోసమని విద్యార్థులను బడి బయటకి తీసుకెళ్లకూడదని సూచించారు.  విద్యార్థులకు చంద్రయాన్ యొక్క ప్రాముఖ్యతని  తెలపాలని కోరారు.

చంద్రయాన్ 3 ఆగస్టు 23న  చంద్రుడిపై అడుగు పెట్టనుంది.  ఇలాంటి అపూర్వ ఘట్టాన్ని లైవ్ చూసేలా  విద్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని డీఈవోలు, ప్రిన్సిపల్ కు  తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో  రేపు సాయంత్రం(ఆగస్టు 23) 5.20కి టీశాట్ ఛానల్ లో  లైవ్ టెలికాస్ట్ కానుంది.