ఏప్రిల్ 20 దాకా టెట్ దరఖాస్తు గడువు .. ఇయ్యాల్టి నుంచి ఎడిట్ ఆప్షన్

ఏప్రిల్ 20 దాకా టెట్ దరఖాస్తు గడువు .. ఇయ్యాల్టి నుంచి ఎడిట్ ఆప్షన్

హైదరాబాద్, వెలుగు: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తు గడువును విద్యా శాఖ పెంచింది. ఈ నెల 20 వరకూ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చని ప్రకటించింది. దరఖాస్తులకు బుధవారమే చివరి రోజు కాగా అభ్యర్థుల విజ్ఞప్తితో గడువును మరో 10 రోజులు పెంచారు. మరోపక్క ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్  కూడా ఇచ్చారు. 

అప్లికేషన్లలో ఏమైనా తప్పులుంటే ఈనెల 11 నుంచి 20 వరకూ సరిచేసుకోవాలని అధికారులు సూచించారు. ‘టెట్’ కు వెబ్ సైటే లేదువిద్యా శాఖ అధికారుల నిర్లక్ష్యంతో నిరుద్యోగులకు తిప్పలు తప్పడం లేదు. టెట్  నిర్వహించిన ప్రతిసారి ప్రత్యేకంగా వెబ్ సైట్  రూపొందిస్తారు. దాని ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవడంతో పాటు సమాచారం తెలుసుకుంటారు. ఈసారి మాత్రం స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్ సైట్​లోనే దాన్ని పెట్టేశారు. వెబ్ సైట్లలో అభ్యర్థులు టెట్, టీఎస్ టెట్, టెట్ 2024 ఇలా ఎన్ని రకాల పేర్లతో వెతికినా పాత టెట్  వెబ్ సైట్లు వస్తున్నాయి. దీంతో చాలా మంది అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్  డిపార్ట్ మెంట్ వెబ్ సైట్ https://schooledu.telangana.gov.in ద్వారానే అప్లై చేసుకోవాలనే ప్రచారాన్ని అధికారులు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.