ఫస్ట్ అండ్ సెకండియర్ విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహిస్తాం

ఫస్ట్ అండ్ సెకండియర్ విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహిస్తాం

ప్రభుత్వ అధీనంలో ఉన్న ఆటనమస్ కాలేజీల్లో మంచి ఫలితాలు వస్తున్నాయని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆటనమస్ కాలేజీలకు ధీటుగా అఫ్లిఫైడ్ కాలేజీలను తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నామని ఆమె తెలిపారు.  ఆటనమస్ కాలేజీల్లో చదివిన విద్యార్థులకు కూడా మంచి ప్లేస్‌మెంట్స్ లభిస్తున్నాయని ఆమె అన్నారు.  ఆటనమస్ కాలేజీలకు రెండు సంవత్సరాలకు ఒకసారి సిలబస్ మార్చుకునే అవకాశమున్నట్లు ఆమె తెలిపారు. అటానమస్ కాలేజీలు ఈ సంవత్సరం దాదాపు 14 రకాల కొత్త కోర్సులు ప్రవేశపెట్టాయని ఆమె తెలిపారు. మోడల్ స్కూల్స్‌లో కూడా మెరుగైన విద్యను అందిస్తున్నామని ఆమె అన్నారు. అదే విధంగా ఖాళీగా ఉన్న పోస్టులలో తాత్కాలికంగా ఉపాధ్యాయులను భర్తీ చేస్తామని ఆమె తెలిపారు.

రాష్ట్రంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు కచ్చితంగా పరీక్షలు నిర్వహిస్తామని ఆమె అన్నారు. ఇంజినీరింగ్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ మరియు సెకండియర్ విద్యార్థులను కరోనా నేపథ్యంలో ప్రమోట్ చేశామని.. వారికి కూడా వీలు చూసి పరీక్షలు నిర్వహిస్తామని ఆమె తెలిపారు. వారికి పరీక్షల విషయంలో ఎలాంటి మినహాయింపు లేదని..  పరీక్షలు ఉండవని అనుకోవద్దని ఆమె అన్నారు. అదేవిధంగా ఫైనల్ ఇయర్ విద్యార్థులకు త్వరలోనే పరీక్షలు నిర్వహిస్తామని ఆమె తెలిపారు.

For More News..

మున్సిపల్ చట్టంలో సవరణలు చేసిన తెలంగాణ ప్రభుత్వం

ఆక్స్‌‌ఫర్డ్ ట్రయల్స్‌కు బ్రేక్.. వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తికి అంతుచిక్కని సమస్యలు

రైతుకు ‘కరెంట్’ షాక్.. రెండు నెలలకు రూ. 3.71 కోట్ల కరెంట్ బిల్లు