Telangana Tour : వరాల తల్లి.. ఏడుపాయల దుర్గమ్మ.. దసరాకు దర్శించుకుందామా..!

Telangana Tour : వరాల తల్లి.. ఏడుపాయల దుర్గమ్మ.. దసరాకు దర్శించుకుందామా..!

చుట్టూరా పచ్చని చెట్లు, కొండలు, మంజీరా నదిలో కలిసే ఏడు పాయలు.. ఇవన్నీ  చూడాలంటే మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలంలో ఉన్న ఏడుపాయల కనకదుర్గమ్మ గుడికి వెళ్లాల్సిందే. ఇక్కడి అమ్మవారు వరాలిచ్చే వన దుర్గా భవానిగా ఎంతో ప్రసిద్ధి. దసరా టైమ్ లో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. 

పేరెలా వచ్చిందంటే...

ఇక్కడి అమ్మవారికి 'ఏడుపాయల దుర్గమ్మ' అని పేరు రావడం వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది. ద్వాపర యుగాంతంలో జనమేజయుడు సర్పాలన్నిటిని నాశనం చేయాలని యాగం చేస్తాడు. ఆ యాగం ఫలితంగా పాములు అన్నీ వచ్చి అగ్నికి ఆహుతవుతుండటంతో నాగుల తల్లి బాధపడుతుంది. దేవుళ్ల దగ్గరికెళ్లి పాములను కాపాడాలని వేడుకుంటుంది. 

దీంతో పాములను కాపడటానికి గరుత్మంతుడు పాతాళంలోని భోగవతీ నదిని భూమ్మీదకి తెస్తాడు. యాగస్థలంలోకి రాగానే ఆ నది ఏడుపాయలుగా చీలి ప్రవహిస్తుంది. సర్పయజ్ఞ గుండాలను ముంచుతూ ఓ పాయ రాతిగుహలో వెలిసిన దుర్గామాత పాదాలను తాకుతూ గోదా వరిలో కలిసిందట.

Also Read :- జూబ్లీహిల్స్లో అర్ధరాత్రి ఓ వ్యక్తిపై యువకుల దాడి

దుర్గమ్మకు బోనం..

తెలంగాణ సంసృ జానపదాలకు, సంప్రదాయాలకు ఏడుపాయల జాతర పెట్టింది పేరు. శివరాత్రి సందర్భంగా జరిగే మూడు రోజుల జాతరకి వేల సంఖ్యలో భక్తులు వస్తారు. జాతరలో ఎడ్లబండ్ల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణ. భక్తులు పట్నాలు వేసి, దుర్గామాతకి బోనాలు సమర్పిస్తారు. మొక్కులు చెల్లించుకుంటారు. ప్రకృతి అందాలకు నెలవైన ఈ ఆలయాన్ని చూసేందుకు టూరిస్టులు కూడా ఎక్కువగా వస్తుంటారు. వంకలు తిరిగి ఉండే ఘనపూర్ ఆనకట్ట, గలగల పారే మంజీరా నది. ఏడు పాయల్ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు.

ఇలా వెళ్లాలి....

మెదక్ జిల్లా నుంచి దాదాపు 20కి.మీ దూరంలో ఉంటుంది ఏడుపాయల దుర్గమ్మ గుడి. హైదరాబాద్ నుంచి 110 కి.మీ జర్నీ, స్టేట్ లోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి మెదక్ కు నేరుగా బస్ ఫెసిలిటీ ఉంది.
 

దర్శనం టైమింగ్స్..

ఉదయం 5:30 నిమిషాల నుంచి సాయంత్రం 6:30 నిమిషాల వరకు. ఆదివారం ఉదయం 5 గంట నుంచి రాత్రి 7 గంటల వరకు.