త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన అగ్నిపథ్ పథకంపై దేశ వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రాష్ట్రాలలో ఈ ఆందోళనలు తీవ్ర రూపం దాలుస్తూ.. అలజడిని స-ృష్టిస్తున్నాయి. అయితే తాజాగా ఈ అగ్నిపథ్ మంటలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నూ టెన్షన్ లో పెట్టాయి. దీంతోఅధికారులు ఢిల్లీనీ అలర్ట్ చేశారు. అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీకి వచ్చే అన్ని జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఢిల్లీకి కనెక్టివిటీ ఉన్న మెట్రో రైల్వే స్టేషన్లను మూసివేసినట్టు ఇప్పటికే ఢిల్లీ మెట్రో అథారిటీ ప్రకటించింది. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ అభ్యర్థుల ఆందోళనలతో ఇప్పటికే నాలుగు రైళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా పోలీసులు నాంపల్లి పోలీస్ స్టేషన్ ను మూసివేశారు. అయితే ఈ క్రమంలోనే కొన్ని రైళ్లను రద్దు చేశామని, మరికొన్నింటిని దారి మళ్లించామని రైల్వేశాఖ వెల్లడించింది.
